పదో తరగతి విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం..
ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు రూ.10 వేల పారితోషికం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పాఠశాల పూర్వ విద్యార్థి, ఎల్లారెడ్డిపేటకు చెందిన ఎన్నారై బొమ్మకంటి సతీష్ కుమార్ గుప్తా నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో గల గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న సతీష్ గుప్తా, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు...