e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

చేయూత పెన్షన్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ

చేయూత పెన్షన్ల నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
– సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
జగిత్యాల, నవంబర్ 27, మన భారత్ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పెన్షన్ల పథకంలో భాగంగా కొత్తగా మంజూరైన పెన్షన్ నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ఆ దేశాల మేరకు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. నిన్న అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాల్లో భాగంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడంతో పాటు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, నేత, గీత కార్మికులు తదితర అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అర్హులైన వారికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు బస్సులు, పెట్రోల్ బంకులు, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో అవకాశాలు కల్పించడం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

తాజాగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయం అందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టిందని, అర్హులైన కుటుంబాలు ఈ పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నిరంతరం కృషి చేస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ వంటి అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలకు, పేద విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.

ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌లకు జగిత్యాల పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పెన్షన్లు అందని అర్హులైన వారు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు లేదా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్, సమిండ్ల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుసరి అనిల్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, చంద్రకళ, శంకర్, చెట్టే గంగాధర్, చీటి లక్ష్మీనారాయణ, మల్లవ్వ, తిరుమలయ్య, చాంద్ పాషా, బొల్లారపూ స్వప్న, గిరిధర్, దుమల రాజ్ కుమార్, కూతురు శేఖర్, కూతురు రాజేష్, సుంకేటి మమత, రామకృష్ణ రెడ్డి, పవిత్ర, మహేష్, జుంబర్తి గంగా లక్ష్మి, రాజ్ కుమార్, షహీన్ బేగం, అప్రోజ్, బడుగు పద్మ, రాజేందర్, కోరే జయ, గంగ మల్లు, పిట్ట ధర్మరాజు, బొలుసాని శ్రీనివాస్, సాయికిరణ్, చందా పృధ్విధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE