e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి ఎస్ఆర్ఎస్ నమోదు, హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాలి
ఎస్ఆర్ఎస్ నమోదు, హాజరు శాతం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ రాజర్షి షా

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26,

పాఠశాలల్లో విద్యార్థుల నమోదు, హాజరు శాతం మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఎస్ఆర్ఎస్ నమోదు తక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు. పాఠశాలలకు దూరంగా ఉంటున్న పిల్లలను తిరిగి బడికి పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ప్రతి పాఠశాలలో రోజువారీ హాజరు వివరాలను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలకు వరుసగా లేదా తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారు బడికి రాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. అవసరమైతే ఉపాధ్యాయులు నేరుగా వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

విద్యార్థుల హాజరు తగ్గడానికి కుటుంబ, సామాజిక లేదా ఇతర కారణాలు ఉంటే వాటిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కేవలం హాజరు వివరాల నమోదు వరకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుతో పాటు నిరంతర హాజరును ప్రోత్సహించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE