e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: జోగు రామన్న

భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 26,

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకున్న గొప్ప ప్రజాస్వామ్య పత్రం అని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపుదిద్దుకున్న రాజ్యాంగం దేశ ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం, భిన్నత్వంలో ఏకత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందించిందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలను కల్పించిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.

పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని జోగు రామన్న విమర్శించారు. రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు దేశంలోని ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై దేశ ప్రజలు రానున్న రోజుల్లో తగిన రీతిలో స్పందిస్తారని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రశ్నలు వచ్చినప్పుడు కేంద్ర మంత్రులు స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్న జోగు రామన్న, ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధ సంస్థల స్వతంత్రతను కాపాడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వెనగంటి ప్రకాష్, అశోక్ స్వామి, సాజితోద్దీన్, కొండ గణేష్, కిరణ్, కస్తాల ప్రేమల, స్వరూప రాణి, బోడగం మమత, కరుణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE