e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా నమోదు.. ప్రత్యేక అధికారిణి ప్రియాంకకు కలెక్టర్ అభినందనలు

విద్యార్థుల హాజరు 90 శాతానికి పైగా నమోదు.. ప్రత్యేక అధికారిణి ప్రియాంకకు కలెక్టర్ అభినందనలు

కస్తూర్బా బాలికల పాఠశాలలో మెరుగైన హాజరు శాతం సాధించినందుకు ప్రశంసాపత్రం

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, ప్రతి నెలా 90 శాతానికి పైగా హాజరు నమోదు చేసినందుకు పాఠశాల ప్రత్యేక అధికారిణి ప్రియాంకను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) డి. మాధవి అభినందించారు.

విద్యార్థుల హాజరును క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా నమోదు చేసే హాజరు వివరాల్లో ప్రతి నెలా 90 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించినందుకు ప్రియాంకను అధికారులు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, డీఈఓ మాధవి చేతుల మీదుగా ప్రత్యేక అధికారిణి ప్రియాంకకు అభినందనలు తెలియజేశారు. విద్యార్థుల క్రమబద్ధమైన హాజరు మెరుగైన విద్యా ఫలితాలకు పునాది అని, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపునకు ఉపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులతో సమన్వయం చేసుకోవడం, చదువుపై ఆసక్తి పెంపొందించడం, పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కస్తూర్బా బాలికల విద్యాలయంలో విద్యార్థుల హాజరు పెంపునకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 90 శాతానికి పైగా నెలవారీ హాజరు సాధించిన ప్రియాంకను అభినందించడం పాఠశాల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, డిఇఓ మాధవి,ఉపాధ్యాయులు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది,పాల్గొనారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE