e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

భారతీయుల జీవన జ్యోతి – భారత రాజ్యాంగం

భారతీయుల జీవన జ్యోతి – భారత రాజ్యాంగం

మొగుళ్ళపల్లి: నవంబర్ 26, (మన భారత్):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ యువజన సంఘం మొగుళ్ళపల్లి మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు రాజ్యాంగ పరిరక్షణ నినాదాలతో, సంవిధాన్ జాగృతి యాత్ర నిర్వహిస్తూ..ప్రజలలో జన చైతన్యం, రాజ్యాంగ స్ఫూర్తిని కల్పించారు. అనంతరం భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించి, సంవిధాన్ ప్రణేత రచించిన అమృతతుల్యమైన రాజ్యాంగాన్ని స్మరించుకున్నారు.

అనంతరం ప్రత్యేక ఆహ్వానితుడిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మొగుళ్లపల్లి మండల అధ్యక్షులు చదువు అన్నారెడ్డి మాట్లాడుతూ..భారత రాజ్యాంగం అనేది భారత జాతికి దిక్సూచి, ప్రజా జీవనానికి ముక్తి మార్గం, సమతా మమతల సంగమం అని అన్నారు. ఈ సంవిధానం ప్రజల జీవితాలలో జ్ఞాన జ్యోతిని..నవోదయ వెలుగులను నింపిందని, ప్రపంచంలోనే అతి పెద్దదైన, సర్వోత్కృష్టమైన, మహోన్నతమైన రాజగ్రంధం ఈ భారత రాజ్యాంగమని కీర్తి ప్రతిష్టలతో అభివర్ణించారు.

ఈ పవిత్ర సంవిధాన్ దివస్ ను దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడు భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం మనందరి సౌభాగ్యం, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. రాజ్యాంగ రచన ప్రధాన ధ్యేయం, లక్ష్య సాధన అయినప్పటికీ, సంవిధానం అమలులోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, సంవిధానం కల్పిస్తున్న సంపూర్ణ హక్కులను, ధర్మ రక్షణను ప్రభుత్వాలు ప్రజల జీవితాల్లో పరిరక్షించలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికల నిర్వహణ, సర్కార్ ఏర్పాటు మాత్రమే కాదని, జనాభిప్రాయానికి స్పందన, సర్వోదయ, అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్క దీనజన, నిరుపేదలకు అందే విధంగా చూడాలని ఉద్బోధించారు.

ఈ సంవిధానం సామాజిక పరివర్తనకు మార్గదర్శి, సామాజిక న్యాయ సాధనకు మహా అస్త్రం అని, పేదలు, బడుగు బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీలు, కార్మికులు, రైతుల హక్కులకు అభయహస్తం, రక్షా కవచంగా 1949 నవంబర్ 26న ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన పుణ్య దినం, సువర్ణ అధ్యాయం అని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)(a) ప్రకారం ప్రతి పౌరుడికి వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును కల్పించిందని, ప్రభుత్వ విధానాలను విమర్శించడం, ప్రజా సమస్యలపై గళమెత్తడం, అవినీతి అక్రమాలను ప్రశ్నించడం, అన్యాయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పౌరులకు ఉన్న జన్మసిద్ధ హక్కుగా, పవిత్ర అధికారంగా పొందుపరచినందుకు గర్విస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకుడు మంద సాంబయ్య, అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల భద్రయ్య, జిల్లా నాయకులు కట్కూరి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బండారి రాజు, కాంగ్రెస్ జిల్లా నాయకులు నడిగోటి రాము, తక్కల్లపల్లి రాజు, ఎలేటి శివారెడ్డి, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు రమేష్, భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ కన్వీనర్ మోరే రవీందర్ రెడ్డి ఇస్సిపేట గ్రామ సర్పంచ్ యార ముకుందరెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు పడిదల నర్సింగారావు, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిమల్ల రమేష్, మాజీ వార్డు మెంబర్ శనిగరపు శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్, మండల నాయకులు శనిగరపు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE