e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన..

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై చైల్డ్ హెల్ప్‌లైన్, ఏఐడీ ప్రతినిధుల అవగాహన కార్యక్రమం

మన భారత్, తలమడుగు, నవంబర్ 26:

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించడంతో పాటు బాలల హక్కులు, రక్షణపై చిన్ననాటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చైల్డ్ హెల్ప్‌లైన్, యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (AID) ప్రతినిధులు సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని అర్లి (కె) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (AID) – JRC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ చర్యలు, వ్యక్తిగత భద్రతపై వివరించారు.

ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్ ఎ. శ్రీకాంత్ మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. 18 సంవత్సరాలు నిండని బాలికలకు, 21 సంవత్సరాలు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

AID ప్రతినిధి ఎస్. కిరణ్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లల విద్య, ఎదుగుదల దెబ్బతింటాయని పేర్కొన్నారు. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో నియమించడం చట్టప్రకారం నిషేధమని వివరించారు. ప్రతి బాలుడు, బాలిక విద్యను అభ్యసిస్తూ సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

అనంతరం గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తమ శరీరానికి సంబంధించిన వ్యక్తిగత హద్దులను గుర్తించాలని, ఎవరైనా అనుచితంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా వెల్లడించాలని, అవసరమైనప్పుడు చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సరసన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఆడే విట్టల్, కలవల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

బాలల రక్షణ కోసం ముఖ్యమైన హెల్ప్‌లైన్ నంబర్లు:
– చైల్డ్ హెల్ప్‌లైన్: 1098
– పోలీస్ అత్యవసర సేవలు: 112

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE