e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి..

పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి
– డీపీఓలో చిల్డ్రన్స్ రూమ్ ప్రారంభించిన ఎస్పీ అశోక్ కుమార్
– చిన్నారుల సంరక్షణ కోసం ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు
జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ :
పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల శ్రేయస్సు, చిన్నారుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ రూమ్‌ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం పండుగలు, పర్వదినాలు, కుటుంబ వేడుకలు అనే తేడా లేకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణతో పాటు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పోలీస్ సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలున్న మహిళా పోలీస్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది కార్యాలయానికి వచ్చినప్పుడు పిల్లల సంరక్షణ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక చిల్డ్రన్స్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది తమ చిన్నారులను ఈ గదిలో ఉంచి కార్యాలయానికి సంబంధించిన పనులను ప్రశాంతంగా పూర్తి చేసుకునేందుకు ఈ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన ఈ గదిలో ఆటవస్తువులు, కూర్చునేందుకు అవసరమైన సౌకర్యాలతో పాటు పిల్లలకు అనుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల పిల్లలు సంతోషంగా సమయం గడపడమే కాకుండా, తల్లిదండ్రులైన పోలీస్ సిబ్బందికి కూడా కొంత ఉపశమనం లభిస్తుందన్నారు. సిబ్బందికి మెరుగైన పని వాతావరణం కల్పించడంతో పాటు వారి కుటుంబాల అవసరాలను గుర్తించి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఆర్ఐ వేణు, మహిళా పోలీస్ సిబ్బంది, వారి పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE