e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ఆ వాహనాలకు బహిరంగ వేలం..

145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం
– జిల్లా ఎస్పి అశోక్కు మార్
– డిసెంబర్ 2న పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ధారూర్ క్యాంప్‌లో వేలం నిర్వహణ
జగిత్యాల, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ పరిధిలో వివిధ కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకొని, ప్రస్తుతం మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం, జగిత్యాలలో భద్రపరిచిన 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించడం జరిగిందని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాల్లో 131 ద్విచక్ర వాహనాలు, 13 త్రిచక్ర వాహనాలు, ఒక నాలుగు చక్రాల వాహనం ఉన్నాయి. మొత్తం 145 వాహనాలకు సంబంధించి బహిరంగ వేలం ప్రక్రియను 2026 డిసెంబర్ 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు జగిత్యాల జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్, ధారూర్ క్యాంప్‌లో నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన వ్యక్తులు నిర్ణీత తేదీ, సమయానికి తగిన గుర్తింపు కార్డుతో వేలం నిర్వహించే ప్రదేశానికి హాజరై వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని కావున ఆసక్తిగల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE