e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

చేనేత కార్మికులకు వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి

చేనేత కార్మికులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి
– మంత్రి అడ్లూరికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి వినతి పత్రం
జగిత్యాల జిల్లా, నవంబర్ 25, మన భారత్ :
చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులకు కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆడువాల జ్యోతి లక్ష్మణ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వయస్సు పైబడటం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధ చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. అదేవిధంగా 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులు కొత్త ఆసరా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు మంజూరు కాకపోవడంతో నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని చేనేత కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, 59 ఏళ్లు దాటిన అర్హులైన వృద్ధులందరికీ కొత్త ఆసరా పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు, నిరుపేద వృద్ధులకు పెన్షన్ ఎంతో ఆర్థిక భరోసానిస్తుందని, ఈ సమస్యను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఆడువాల జ్యోతి లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కార్యదర్శి వీరబత్తిని శ్రీనివాస్, జగిత్యాల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోగ గంగాధ, జగిత్యాల పద్మశాలి సేవా సంఘ కోశాధికారి ప్రభాకర్, కార్యదర్శి నరేష్, సందీప్, సిరిపురం నిరంజన్, ఆడవాల శ్రీనివాస్, ఆడపు సత్యం, పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE