e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ..

ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ
రాష్ట్ర ఇన్‌చార్జి బీఎం. సందీప్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ భేటీ

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 25, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి బీఎం. సందీప్ కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌లను ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొని రాష్ట్ర నాయకులను శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ చైర్మన్ దేవ్తాడే మంగేష్ కుమార్, డీసీసీ జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై రాష్ట్ర నాయకులతో జిల్లా నాయకులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జిల్లా పార్టీ పునర్నిర్మాణం, గ్రామస్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను చురుకుగా భాగస్వాములను చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించారు.

అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వాటి ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం వంటి అంశాలపై కూడా చర్చించారు. జిల్లాలో పార్టీ ప్రజాదరణను పెంపొందించేందుకు భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయకుల దృష్టికి జిల్లా నాయకులు పలు అంశాలను తీసుకెళ్లారు.

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా మరింత బలపడేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించినట్లు నాయకులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE