e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా

నవంబర్ 26న ఆదిలాబాద్‌లో వేడుకలు.. అంబేద్కర్ చౌక్‌లో ఉదయం 11 గంటలకు కార్యక్రమం

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 23,

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న నిర్వహించనున్న 77వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల పోస్టర్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు. ముఖ్యంగా సమానత్వం, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్వాహకులకు సూచించారు.

నవంబర్ 26న అంబేద్కర్ చౌక్‌లో వేడుకలు

మాల, మహార్, నేతకాని, అనుబంధ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 26న ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వద్ద 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందించిన సేవలు, రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలు, ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్రపై అవగాహన కల్పించనున్నారు.

రాజ్యాంగ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ప్రజలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, జేఏసీ నాయకులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE