e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. రైతుల రాస్తా రోకోకు ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు

మన భారత్, తలమడుగు:నవంబర్ 23,

తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన రాస్తా రోకో కార్యక్రమానికి సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మద్దతు తెలిపారు. మండలంలోని సుంకిడి గ్రామ సమీపంలో అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తలమడుగు మండలంలో వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడులు తగ్గడం, సాగు ఖర్చులు పెరగడం వంటి సమస్యలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షపాతం సాధారణంగా నమోదైనట్లు గణాంకాల్లో కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రైతుల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా నిలిచిన ముడుపు మౌనిష్ రెడ్డి మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.

రైతుల సమస్యల పరిష్కారానికి ప్రజా మద్దతు అవసరమని, రైతులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలవాలని ఆయన తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE