e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

అగ్నిప్రమాద బాధిత రైతుకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం..

అగ్నిప్రమాద బాధిత రైతుకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆర్థిక సాయం

పంట నష్టాన్ని పరిశీలించి పరామర్శ.. తక్షణ సాయంగా రూ.20 వేల అందజేత

మన భారత్, భీంపూర్: నవంబర్ 19, అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంటను పూర్తిగా కోల్పోయి తీవ్ర నష్టానికి గురైన రైతుకు బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జాదవ్ అండగా నిలిచారు. భీంపూర్ మండలం పిప్పల్ కోటి గ్రామానికి చెందిన రైతు షేక్ జావీద్‌ను ఎమ్మెల్యే పరామర్శించి, జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. తక్షణ సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేసి రైతుకు ధైర్యం చెప్పారు.

పిప్పల్ కోటి గ్రామ శివారులో రైతు షేక్ జావీద్ సుమారు 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో ప్రమాదవశాత్తు పొలంలో మంటలు చెలరేగడంతో మొత్తం పంట అగ్నికి ఆహుతైంది. దీంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. కష్టపడి సాగు చేసిన పంట కళ్ల ముందే కాలిపోవడంతో బాధిత రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంట పొలాన్ని సందర్శించి అగ్నిప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దగ్ధమైన మొక్కజొన్న పంటను పరిశీలించి రైతుకు జరిగిన నష్టంపై ఆరా తీశారు. అనంతరం బాధిత రైతు షేక్ జావీద్‌ను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. తక్షణ సహాయంగా రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా బాధిత రైతుకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పంట నష్టాన్ని పరిశీలించి, అర్హమైన ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకుడు కేమ శ్రీకాంత్,, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE