e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

జిల్లా యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. జానపద నృత్యాలు పాటలతో అలరింపు

జిల్లా యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ.. జానపద నృత్యాలు, పాటలతో అలరింపు

మన భారత్, బజార్‌హత్నూర్: నవంబర్ 18, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ కాన్ఫరెన్స్ హాల్‌లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో బజార్‌హత్నూర్ మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు తమ కళా ప్రతిభతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకుని పలువురి ప్రశంసలు అందుకున్నారు.

యువజన ఉత్సవాల్లో భాగంగా మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన సోలో ప్రదర్శనలు, తెలంగాణ డప్పుల జానపద నృత్యాలు, జానపద గీతాలు విశేషంగా అలరించాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు ప్రదర్శించిన కళారూపాలు కార్యక్రమానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. విద్యార్థుల ప్రదర్శనలను వీక్షించిన ప్రేక్షకులు చప్పట్లతో అభినందించారు. న్యాయనిర్ణేతలు సైతం విద్యార్థుల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఈ సందర్భంగా మోడల్ స్కూల్ సంగీత ఉపాధ్యాయులు, సకల కళా డైరెక్టర్ కాత్లే శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి యువజన ఉత్సవాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. చదువుతో పాటు సంగీతం, నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయి వేదికపై తమ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు పొందడం ఆనందంగా ఉందన్నారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని అభినందించిన న్యాయనిర్ణేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే యువజన ఉత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించి ప్రోత్సహించిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ప్రేమ్ కుమార్‌లకు, సహకరించిన సంగీత ఉపాధ్యాయులు ఆనంద్, తిరుపతి, శ్యామలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రదర్శనల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరినీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE