e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ఉద్యమకారుల మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ..

ఉద్యమకారుల హామీల అమలుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి

మేడారం మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకుల పిలుపు

మన భారత్ చిట్యాల:  తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెలలో 22న, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించనున్న సభ మరియు మహా పాదయాత్రకు సంబంధించి చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మూడు మండలాల సన్నాహక సమావేశం బుధవారం చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించారు. చిట్యాల మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు జన్నె యుగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫోరం రాష్ట్ర కార్యదర్శి మందల రవీందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి, నియోజకవర్గ కన్వీనర్ పైడిపల్లి రమేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు ములుగు జిల్లా మేడారంలో జరిగే సభ మరియు మహా పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేర్చి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.

కేకే కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా, వెంటనే వెబ్‌సైట్ ప్రారంభించి ఉద్యమకారుల వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మేడారం మహా పాదయాత్రను విజయవంతం చేసేందుకు మూడు మండలాల ఉద్యమకారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కత్తి సంపత్, కాట్రేవుల కుమార్, మండల నాయకులు కన్నెబోయిన అశోక్, సాద మల్లయ్య, నిమ్మల సారయ్య, కంచర్ల కుమారస్వామి, పువ్వాటి హరికృష్ణ, బొడ్డు తిరుపతి, ఇజ్జిగిరి ఆనందం చెక్క నర్సయ్య,, బొట్ల రవి, బయగాను గణపతి, జంబుల చంద్రమౌళి, కోడల రాయమల్లు, గొర్రె సతీష్, శ్రీరాం సదయ్య, భోగం నరసయ్య, గోల్కొండ చక్రపాణి, వేముల శ్రీనివాస్, గుండ రవీందర్, గురుకుంట్ల కిరణ్, రాయిని శ్రీకాంత్, ఉప్పుల కిరణ్, ఓదెల రాజ్ కుమార్, జక్కుల కిరణ్, కాట్రేవుల రాజయ్య, గుర్రాల సుమన్, గుడిమల్ల రమేష్, దేవరకొండ సత్యనారాయణ, గట్టు రవి, పున్నం చంద్రయ్య, రాజయ్య, పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE