e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కోళ్ల రజినీకాంత్ నియామకం

బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కోళ్ల రజినీకాంత్ నియామకం

పార్టీ బలోపేతంతో పాటు ప్రజా, మండల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కోళ్ల రజినీకాంత్

మన భారత్, తలమడుగు: నవంబర్ 17, తలమడుగు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు కోళ్ల రజినీకాంత్‌కు పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఈ నియామకానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించగా, పార్టీ నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కోళ్ల రజినీకాంత్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలకమైన బాధ్యతను అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి, తలమడుగు మండల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా మండలంలో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు.

ఈ బాధ్యతను అప్పగించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందం, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కాళ్ల సాయి కృష్ణతో పాటు పార్టీ పెద్దలకు, జిల్లా నాయకులకు, తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు కోళ్ల రజినీకాంత్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ నియామకంతో తలమడుగు మండల బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE