e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

ఆదివాసీలకు ఆసరా పింఛన్లు మంజూరు..

30 మంది ఆదివాసీలకు ఆసరా పింఛన్లు మంజూరు

సర్పంచ్ కత్లే ప్రవీణ, కార్యదర్శి హిమబిందుకు లబ్ధిదారుల ఘన సన్మానం

మన భారత్, ఇచ్చోడ: ఇచ్చోడ మండల పరిధిలోని దుబార్పేట్ గ్రామపంచాయతీలో ఆసరా పింఛన్లు మంజూరైన 30 మంది ఆదివాసీ లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా పింఛన్ల మంజూరుకు సహకరించిన గ్రామ సర్పంచ్ కత్లే ప్రవీణ, పంచాయతీ కార్యదర్శి హిమబిందును లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామపంచాయతీ పరిధిలోని అర్హులైన 30 మంది ఆదివాసీ కుటుంబాలకు ఆసరా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే పింఛన్ నగదు వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా కొంత అండగా నిలవనుంది. ఈ క్రమంలో పింఛన్ల మంజూరు ప్రక్రియలో సహకరించి, లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ అందజేసిన సర్పంచ్, కార్యదర్శికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ సమస్యలను గుర్తించి, పింఛన్లు మంజూరయ్యేలా సహకరించిన సర్పంచ్ కత్లే ప్రవీణ, పంచాయతీ కార్యదర్శి హిమబిందుకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్లే ప్రవీణ, పంచాయతీ కార్యదర్శి హిమబిందు, వార్డు సభ్యుడు పవన్, గ్రామ పటేల్ జోతీరాం, గంగారాం పటేల్, 30 మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE