e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

జామిడిలో 25 మంది వితంతు వికలాంగులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ

జామిడిలో 25 మంది వితంతు, వికలాంగులకు పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ

మన భారత్, తాంసి:నవంబర్ 17,

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు తాంసి మండలం జామిడి గ్రామానికి చెందిన 25 మంది వితంతు, వికలాంగుల పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్ కాపీలను గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి లావణ్యతో కలిసి లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఈరగొల్ల అశోక్ మాట్లాడుతూ.. అర్హులైన వితంతువులు, వికలాంగులకు ప్రభుత్వ పెన్షన్లు అందడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE