e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

అర్హులైన పేదలకు ఆసరా భరోసా.. నియోజకవర్గంలో 5,457 పెన్షన్లు మంజూరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

అర్హులైన పేదలకు ఆసరా భరోసా.. నియోజకవర్గంలో 5,457 పెన్షన్లు మంజూరు: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

తాంసి మండలంలో 336 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ

తాంసి, మన భారత్:నవంబర్ 17,

పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తాంసి మండల కేంద్రంలో నిర్వహించిన ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 336 మంది నూతన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బోథ్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 5,457 పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, నిరుపేద కుటుంబాలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.

అలాగే నియోజకవర్గంలోని రహదారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ముంపునకు గురైన ఇళ్ల బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE