e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు..

బ్యాంకింగ్ సేవలపై అవగాహన సదస్సు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు బ్యాంకు ఖాతాలు తప్పనిసరి: మేనేజర్ వెంకట సాయి కిరణ్

మన భారత్, తలమడుగు:నవంబర్ 16,

తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తలమడుగు శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ వెంకట సాయి కిరణ్ పాల్గొని గ్రామస్థులకు వివిధ బ్యాంకింగ్ సేవలు, పొదుపు పథకాలు, బీమా సదుపాయాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా మేనేజర్ వెంకట సాయి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు అందాలంటే బ్యాంకు ఖాతాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆర్థిక భద్రత, పొదుపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జనధన్ యోజన, ప్రధానమంత్రి జీవిత జ్యోతి బీమా యోజన, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాల అర్హతలు, ప్రయోజనాలు, వాటి ద్వారా లభించే ఆర్థిక భద్రత గురించి వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకొని అందుబాటులో ఉన్న పథకాలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ అవగాహన సదస్సులో కాడే స్వామి, కమలేశ్, గ్రామ సర్పంచ్ జంగు, ఉపసర్పంచ్ శీలా, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE