e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నానాజీకి ఆర్థిక సహాయం

అనారోగ్యంతో మంచానికే పరిమితమైన నానాజీకి ఆర్థిక సహాయం
నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి

మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి చెందిన ఎల్చల నానాజీ అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన వైద్య ఖర్చులు, కుటుంబ పోషణ భారంగా మారిన విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు.

నానాజీ కుటుంబ పరిస్థితిని తెలుసుకుని ఆయనను పరామర్శించి, కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడం, అవసరమైన వారికి తోడ్పాటు అందించడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న (చంటి), అనిరుద్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE