e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ.. సందడిగా ఫుడ్ ఫెస్టివల్

దేవపూర్ ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ.. సందడిగా ఫుడ్ ఫెస్టివల్

మన భారత్, తలమడుగు:నవంబర్ 14,

బాలల హక్కులు, విద్యార్థుల సమస్యలు, పాఠశాల అభివృద్ధి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో దేవపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. బాలలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేలా గ్రామసభ వేదిక కల్పించింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, క్రమశిక్షణ, బాలల సంక్షేమం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

అనంతరం పాఠశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆహార పదార్థాలపై అవగాహనతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకత, స్వయం ప్రతిభ, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు అవకాశం కలిగింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మేకల శ్రీరాములు, వార్డు సభ్యులు డి. గంగాధర్, గ్రామ కార్యదర్శి ఇజ్జిగిరి రాందాస్, దూస నర్సింలు, నాఈని సురేష్, శానం నడిపి బూమన్న, షగంటి ఆశన్న, దేవల్ల స్వామి, బాగోతుల శేఖర్, శీపతి గంగయ్యతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

బాలల భాగస్వామ్యంతో నిర్వహించిన గ్రామసభ, ఫుడ్ ఫెస్టివల్ పాఠశాలలో సందడి వాతావరణాన్ని నెలకొల్పాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE