e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు.. కుక్‌పై పోక్సో కేసు

పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు.. కుక్‌పై పోక్సో కేసు
నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు
మైనర్ బాలికల పట్ల అసభ్య ప్రవర్తనను సహించేది లేదు: రూరల్ సీఐ రహీం పాషా

మన భారత్, ఆదిలాబాద్:

పాఠశాలలో చదువుకుంటున్న మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలలో కుక్‌గా పనిచేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ద్వారా రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ రహీం పాషా నవంబర్ 14న వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెడం లచ్చు అలియాస్ లక్ష్మణ్ (50) కొంతకాలంగా ఓ పాఠశాలలోని మైనర్ బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ద్వంద్వార్థాలు వచ్చే మాటలు మాట్లాడటం, అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేయడం, బాలికలను అసభ్యంగా తాకడం వంటి చర్యలకు పాల్పడినట్లు షీ టీమ్‌కు ఫిర్యాదు అందింది.

అంతేకాకుండా తనతో మాట్లాడకపోతే బాలికల గురించి ఇతరుల వద్ద చెడుగా ప్రచారం చేస్తానంటూ బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

షీ టీమ్‌కు అందిన ఫిర్యాదు ఆధారంగా ఆదిలాబాద్ రూరల్ పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం గెడం లచ్చు అలియాస్ లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఈ సందర్భంగా రూరల్ సీఐ రహీం పాషా మాట్లాడుతూ.. మైనర్ బాలికలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పాఠశాలలు, విద్యాసంస్థల్లో బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వేధింపులకు గురైన వారు భయపడకుండా పోలీసులకు లేదా షీ టీమ్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలల రక్షణ విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE