e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

బీసీ వసతి గృహాన్ని సందర్శించిన సర్పంచ్.. విద్యార్థుల సమస్యలపై ఆరా

బీసీ వసతి గృహాన్ని సందర్శించిన సర్పంచ్ రాజన్న.. విద్యార్థుల సమస్యలపై ఆరా

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి – ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి

మన భారత్, తలమడుగు:నవంబర్ 13,

తలమడుగు గ్రామంలోని బీసీ వసతి గృహాన్ని గ్రామ సర్పంచ్ రాజన్న గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు, అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై వార్డెన్ నర్సింలుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వసతి గృహంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న సర్పంచ్, ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, సమతుల్యమైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తెలిపారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే తగిన వైద్య సేవలు అందించేలా చూడాలని సూచించారు.

విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా వసతి గృహంలో మెరుగైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని సర్పంచ్ వెలుగు రాజన్న తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  రాజన్న, బీసీ వసతి గృహ వార్డెన్ నర్సింలు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE