e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు.. 10 దుకాణాలకు పెనాల్టీలు

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు.. 10 దుకాణాలపై పెనాల్టీలు
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలి – కలెక్టర్ కార్యాలయం స్పష్టీకరణ

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 12,

ఆదిలాబాద్ జిల్లాలో బియ్యం విక్రయాలపై అధికారులు నిఘా పెంచారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించేలా జిల్లా పౌర సరఫరాల శాఖ, తూనికలు–కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ప్రతిరోజూ తనిఖీలు చేపడుతూ అధిక ధరలకు బియ్యం విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు నవంబర్ 12న కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వివరాలను వెల్లడించింది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 52 హోల్‌సేల్ దుకాణాలు, 85 రిటైల్ దుకాణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించిన 3 హోల్‌సేల్ దుకాణాలు, 7 రిటైల్ దుకాణాల వ్యాపారులపై పెనాల్టీలు విధించినట్లు వెల్లడించారు.

తనిఖీల సందర్భంగా కిరాణా వ్యాపారులు, సూపర్ మార్కెట్ల నిర్వాహకులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వినియోగదారులు కూడా బియ్యం కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలను పరిశీలించాలని సూచించారు.

ప్రభుత్వం నిర్ణయించిన బియ్యం ధరలు ఇలా ఉన్నాయి:

1. బీపీటీ, కేఎన్‌ఎం బియ్యం – కిలో రూ.66.
2. ఆర్‌ఎన్‌ఆర్ / తెలంగాణ సోనా బియ్యం – కిలో రూ.74.
3. హెచ్‌ఎంటీ / జేఎస్‌ఆర్ బియ్యం – కిలో రూ.79.

పై ధరల కంటే అధికంగా బియ్యం విక్రయించినట్లయితే వినియోగదారులు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ కార్యాలయం కోరింది. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ప్రజలు బియ్యం కొనుగోలు సమయంలో ధరల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE