e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ..

కోసాయి గ్రామ విద్యార్థులకు బెల్టులు, టైలు, యూనిఫాంల పంపిణీ

విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ అందించిన దుస్తుల పంపిణీ.. సర్పంచ్ శైలజ రవికి గ్రామస్థుల కృతజ్ఞతలు

మన భారత్, తలమడుగు:నవంబర్ 11,

తలమడుగు మండలంలోని కోసాయి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బెల్టులు, టైలు, యూనిఫాంలను గ్రామ సర్పంచ్ శైలజ రవి విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన యూనిఫాం సామగ్రిని అందించడంతో విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది.

ఈ సందర్భంగా విద్యార్థులకు బెల్టులు, టైలు, యూనిఫాంలను అందజేసి, పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వం అందించిన విద్యా సామగ్రిని విద్యార్థులకు అందించడంలో చొరవ చూపిన గ్రామ సర్పంచ్ శైలజ రవికి కోసాయి గ్రామ ప్రజల తరఫున పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE