e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఘన నివాళులు

మన భారత్, ఆదిలాబాద్:

జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అదనపు కలెక్టర్లు ఆర్.ఎస్. చిత్రూ, ఎస్. రాజేశ్వర్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో విద్యావ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆయన ఆశయం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సమిష్టి కృషి అవసరమని కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్, మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ కలీం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, విద్యాశాఖకు చెందిన అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా ఆజాద్ ఆశయాలను స్మరించుకుంటూ విద్య ప్రాధాన్యతను చాటిచెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE