e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

కస్టమర్ సర్వీస్ సెంటర్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం.. వ్యక్తి అరెస్ట్

కస్టమర్ సర్వీస్ సెంటర్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం.. వ్యక్తి అరెస్ట్

అధిక వడ్డీకి అప్పులిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడు – చెక్కులు, బ్యాంకు పత్రాలు, నకిలీ ముద్ర స్వాధీనం

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 2 ,వినియోగదారుల సేవా కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇచ్చోడ మండలం సిరిచెల్మ ఎక్స్‌రోడ్ వద్ద ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్న జల్దా గ్రామానికి చెందిన అడే కైలాష్ (36) ఈ వ్యవహారంలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. అడే కైలాష్ తన వినియోగదారుల సేవా కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలకు అధిక వడ్డీపై అప్పులు ఇస్తున్నట్లు విచారణలో గుర్తించారు. అప్పులు తీసుకున్న వారి నుంచి చెక్కులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇతర ఆర్థిక పత్రాలను సేకరిస్తూ ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా బ్యాంకు సేవా కేంద్రానికి సంబంధించిన ముద్రను దుర్వినియోగం చేస్తూ నకిలీ రబ్బరు ముద్రను ఉపయోగించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 501/2026, తెలంగాణ ప్రాంత వడ్డీ వ్యాపారుల చట్టంలోని సెక్షన్ 3(5)(బి) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితుడి వద్ద నుంచి ఒక ఖాళీ చెక్కు, ఒక బ్యాంకు పాస్ పుస్తకం, సేవా కేంద్రం ముద్రతో ఉన్న రెండు బ్యాంకు డిపాజిట్ రశీదులు, మరో నాలుగు బ్యాంకు డిపాజిట్ రశీదులు, ఒక నకిలీ రబ్బరు ముద్రను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ బి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు చట్టబద్ధమైన అనుమతులు లేని వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకోవద్దని సూచించారు. అప్పుల వ్యవహారాల్లో చెక్కులు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇతర వ్యక్తిగత పత్రాలను అపరిచితులకు అప్పగించకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. అక్రమ వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE