e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం
కేటీఆర్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 2 ,బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేదని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ నరేష్ జాదవ్‌తో కలిసి బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై పలు ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గిరిజనులు, దళితులు అధికంగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ విద్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. జిల్లాలో కనీసం యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసేందుకు కూడా గత ప్రభుత్వం చొరవ చూపలేదని విమర్శించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ఆరోపించారు.

*చనాకా-కొరాట ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నలు

చనాకా-కొరాట ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరగడంపై వారు ప్రశ్నలు లేవనెత్తారు. తొలుత సుమారు రూ.350 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు డీపీఆర్ అంచనా వ్యయం ప్రస్తుతం దాదాపు రూ.2,000 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం ఇంతగా పెరగడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలకు కూడా గత ప్రభుత్వమే సమాధానం చెప్పాలని అన్నారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జిల్లాకు చేసిన అభివృద్ధి పనులు, తీసుకొచ్చిన పరిశ్రమలు, విద్యాసంస్థల వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సంబంధించిన అభివృద్ధి అంశాలపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతోందన్నారు. ప్రభుత్వం పదవీకాలంలో ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున మిగిలిన హామీలను కూడా దశలవారీగా నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ మీడియా సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు దుర్గం భాస్కర్, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE