e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగు రవి

ప్రజాప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగు రవి

ఆదిలాబాద్ అభివృద్ధి, రైతుల సంక్షేమంపై బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు వెల్లడించాలి

మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 2, ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతు గర్జన సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు జోగు రవి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధులపై అమర్యాదకరంగా, వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.

సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జోగు రవి మాట్లాడుతూ.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు విధానపరంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా, గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదన్నారు. ప్రజల సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి అంశాలపై చర్చించాల్సిన నాయకులు అనుచిత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.

గతంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారో స్పష్టం చేయాలని జోగు రవి ప్రశ్నించారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అప్పట్లో తీసుకున్న చర్యలు ఏమిటి? స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించారు? అనే విషయాలను బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, రైతుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, ప్రస్తుత పరిస్థితులపై వాస్తవాలతో మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. రాజకీయ విమర్శల కంటే ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి అంశాలపై చర్చకు రావాలని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్, గంట జీవన్, ఆత్రం సాయి, సతీష్, మనోజ్, విలాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE