e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణం

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణం

మన భారత్, తలమడుగు: అక్టోబర్ 27,

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో వర్షపాతం, భూగర్భజలాల లభ్యతపై ప్రభావం పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామపంచాయతీలో బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామానికి చెందిన ఒసాకా అశోక్ ఇంటి సమీపంలోని బోరింగ్ వద్ద ఈ రీచార్జ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు.

వర్షాకాలంలో కురిసే వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడంతో పాటు, బోరింగ్ నుంచి వినియోగం అనంతరం వృథాగా బయటకు వెళ్లే నీటిని సైతం రీచార్జ్ నిర్మాణం ద్వారా భూగర్భంలోకి మళ్లించే అవకాశం ఉంటుంది. దీంతో నీటి వృథాను తగ్గించడంతో పాటు భూగర్భజలాల నిల్వలను పెంచేందుకు ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ బోర్‌వెల్ రీచార్జ్ వంటి నిర్మాణాలను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్‌లో నీటి కొరతను కొంతమేర ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వర్షపు నీటిని అందుబాటులో ఉన్న వనరుల వద్దే నిల్వ చేసి భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణకు తోడ్పాటు అందించవచ్చని తెలిపారు.

ఈ బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణం కోసం కృషి చేసిన కుచులపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మోడేపు వెంకన్న ను గ్రామస్తులు అభినందించారు, ఉప సర్పంచ్ రాగి నీలాబాయి దీపక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సాయిరాజ్, పంచాయతీ కార్యదర్శి సాయికుమార్లను గ్రామస్థులు అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE