e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 27, 2026

అంగన్వాడీ కేంద్రం–2లో ఐసీడీఎస్ అధికారుల పరిశీలన

తలమడుగు అంగన్వాడీ కేంద్రం–2లో ఐసీడీఎస్ అధికారుల పరిశీలన

మన భారత్, తలమడుగు: తలమడుగు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం–2ను ఐసీడీఎస్ అధికారులు సోమవారం సందర్శించి కేంద్రంలో చిన్నారులకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలపై అధికారులు ఆరా తీశారు.

చిన్నారులకు అందుతున్న ఆహారం, దాని నాణ్యత, పిల్లల ఆరోగ్య పరిస్థితిపై వారి తల్లిదండ్రులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య, పోషకాహార సంబంధిత సేవలను సక్రమంగా అందించాలని సూచించారు.

ఈ సందర్భంగా మండల స్పెషల్ అధికారి మాట్లాడుతూ బాలింతలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సకాలంలో వైద్య చికిత్స పొందడంతో పాటు వైద్యుల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. తల్లి ఆరోగ్యం, శిశువు ఆరోగ్యానికి పోషకాహారం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల పోషణ, ఆరోగ్యం, ప్రాథమిక విద్యకు సంబంధించిన అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులు సూచించారు. పిల్లల తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి విజయ, ఈవో ప్రతిభ, జెండర్ స్పెషలిస్ట్ కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్ రమణ, ఆయా రజిత, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE