e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, October 26, 2026

రైతు గర్జనను విజయవంతం చేయాలి..

నవంబర్ 1న రైతు గర్జనను విజయవంతం చేయాలి

వార్డుల్లో జోగు రామన్న విస్తృత పర్యటన.. కమిటీలతో సమావేశాలు

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి గొంటి ముక్కుల ప్రసాద్: అక్టోబర్ 26,

నవంబర్ 1న నిర్వహించనున్న రైతు గర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదిలాబాద్ పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులు, వార్డు కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మాలక్ష్మివాడ, ఖానాపూర్, కూలీపుర, పిట్టలవాడ ప్రాంతాల్లో వార్డు కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన జోగు రామన్న.. నవంబర్ 1న జరగనున్న రైతు గర్జనకు ప్రజలను సమీకరించడం, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలకు సూచనలు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులు జోగు రామన్నను శాలువాలతో సత్కరించారు.

ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలతో పాటు వృద్ధుల పింఛన్ల పెంపు, అత్తాకోడళ్లకు నెలకు రూ.2,500 చొప్పున ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం వంటి హామీల అమలుపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు సంబంధించిన రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుపైనా ఆయన విమర్శలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

రైతుల సమస్యలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, రైతుల తరఫున ప్రశ్నించడమే లక్ష్యంగా నవంబర్ 1న రైతు గర్జన నిర్వహిస్తున్నట్లు జోగు రామన్న తెలిపారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, యూనిస్ అక్బాని, అశోక్ స్వామి, ఎజాజ్, ధమ్మపాల్, మెట్టు ప్రహ్లాద్, పండ్ల శ్రీనివాస్, చెన్నై సాయి, అయూబ్, సాగర్, ప్రశాంత్, జమీల్, సంజీయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE