e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

స్మశానవాటిక రోడ్డు పనులు ప్రారంభం..

చిట్యాలలో రూ.70 లక్షల సీఆర్ఆర్ నిధులతో శ్మశానవాటిక రోడ్డు పనులు ప్రారంభం

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చొరవతో ప్రారంభమైన పనులు – సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య ప్రత్యేక ధన్యవాదాలు

మన భారత్,చిట్యాల: చిట్యాల గ్రామంలో సీఆర్ఆర్ (CRR) నిధులు రూ.70 లక్షలతో చేపట్టనున్న శ్మశానవాటిక రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం 2025లో శంకుస్థాపన చేసిన ఈ రోడ్డు పనులను పంచాయతీరాజ్ ఏఈ అరుణ గారు, ఉపసర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు తౌటం నవీన్, మైదం శ్రావ్య శ్రీకాంత్, శనిగారపు మొగిలి, వేల్పుల లక్ష్మీ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

గత సంవత్సరం శంకుస్థాపన జరిగినప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో, గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య గారు రెండు జనరల్ బాడీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్మశానవాటిక రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గౌరవ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గారు సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా రూ.70 లక్షల సీఆర్ఆర్ నిధులతో చేపడుతున్న శ్మశానవాటిక రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చొరవ చూపిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారికి సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే, సదరు కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సర్పంచ్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైరం భద్రయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ చిలుముల రమణాచారి, ఉప్పల కిరణ్, ముసాపురి రవీందర్, ఉప్పల రవీందర్, పిట్టల రవీందర్, జెట్టి రాజన్న, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9603952108

User Name : user_name : రాజు శీలపాక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE