e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, October 13, 2026

శ్రీ కృష్ణ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రారంభం..

ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌక్‌లో శ్రీ కృష్ణ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రారంభం

ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, అక్టోబర్ 12, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కన్సల్టెన్సీ కేంద్రం నిర్వాహకులు అడ్డి సంఘర్ష్ రెడ్డి, జలగం గోపిలకు అభినందనలు తెలిపారు.

జిల్లా కేంద్రంలో నూతనంగా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రారంభం కావడం పట్ల నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థ అభివృద్ధి సాధించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. నూతనంగా వ్యాపార రంగంలో అడుగుపెట్టే వారు నాణ్యమైన సేవలు, నమ్మకంతో ప్రజల ఆదరణ పొందాలని పేర్కొన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు, ఆహ్వానితులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE