e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఎమ్మెల్యే ఆదేశాలు.. ఎమ్మార్వోకు నేతల వినతి

 

-రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం: బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్

తాంసి, అక్టోబర్ 09: తాంసి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు తహసీల్దార్‌ (ఎమ్మార్వో)కు వినతిపత్రం అందజేశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ తాంసి మండల కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్ మాట్లాడుతూ.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు పంటల సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతో ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతుల పరిస్థితిని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి, తాంసి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ సహాయ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించే వరకు బీఆర్ఎస్ పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE