e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

మీ ఓటు నమోదు చేసుకోవాలి

భూపాలపల్లి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ అందరూ Form-18 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలి

-అజయ్ రెడ్డి రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు

మొగుళ్ళపల్లి, అక్టోబర్ 06, (మన భారత్):

భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ Form-18 ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్‌గా తమ పేరును నమోదు చేసుకుని జరగబోయే ఎమ్మెల్సీ ఎలెక్షన్ లో ఓటు వేయడానికి అర్హత పొందాలని యూత్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ రెడ్డి కోరారు.నవంబర్ 1, 2023 లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి అయినవారు అందరూ ఆలస్యం చేయకుండా తమ దరఖాస్తులను సంబంధిత ఎన్నికల అధికారులకు సమర్పించాలి లేదా ఆన్లైన్ లో ఫారం 18 సబ్మిట్ చేయాలని ఆయన సూచించారు. ఇంతకముందు గ్రాడ్యుయేట్ ఓటరు అయినా కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి. సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి, 2026 నవంబర్ 6 లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో పరిశీలించుకోవాలని అజయ్ రెడ్డి పిలుపునిచ్చారు.

మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE