e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

పంట దిగుబడిపై ఆందోళనతో రైతు ఆత్మహత్య

మన భారత్, అక్టోబర్ 5, తలమడుగు: పంట దిగుబడి సరిగా రాకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, బ్యాంకు రుణ భారం వంటి కారణాలతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తలమడుగు మండలంలో చోటుచేసుకుంది.

తలమడుగు గ్రామానికి చెందిన కాడే లక్ష్మన్న (65) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పాటు, తన ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం బ్యాంకు రుణం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పంట దిగుబడి ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా ఆయనను వేధించినట్లు పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు, రుణ భారం, పంట దిగుబడిపై నెలకొన్న అనిశ్చితి కారణంగా లక్ష్మన్న తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మృతుడి భార్య కాడే నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైతు ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE