e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తులు చేపట్టిన సర్పంచ్

లక్ష్మీపూర్‌లో ఆర్‌అండ్‌బీ రోడ్డు మరమ్మత్తులు చేపిస్తున …సర్పంచ్

బిల్లులు రాకున్నా సొంత నిధులతో గ్రామాభివృద్ధి పనులు: సర్పంచ్ తొడసం రాధ మనోహర్

మన భారత్, అక్టోబర్ 5, తలమడుగు:

గ్రామ ప్రజల రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి, రోడ్డు భద్రతా పనులు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామ పరిధిలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా తెలుపు రంగుతో మార్కింగ్ పనులను విజయవంతంగా నిర్వహించారు. అలాగే రోడ్డుకు సంబంధించిన మరమ్మతు పనులను కూడా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం రాధ మనోహర్ మాట్లాడుతూ.. ప్రజల రోడ్డు భద్రతే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో రోడ్డు భద్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద వైట్ మార్కింగ్ చేయడం వల్ల రాత్రి వేళల్లో కూడా వాహనదారులకు అవి స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీకి సంబంధించిన బిల్లులు ఇంకా అందకపోయినా గ్రామ అభివృద్ధి పనులను నిలిపివేయకుండా అవసరమైన సందర్భాల్లో అప్పు చేసి, సొంత నిధులతో పనులు చేపడుతున్నామని సర్పంచ్ రాధ మనోహర్ తెలిపారు. గ్రామంలో ఏ సమస్య తన దృష్టికి వచ్చినా తన వంతు బాధ్యతగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామంలో మౌలిక వసతుల మెరుగుదల, రహదారి భద్రత, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామ ప్రజలు కూడా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు.

రోడ్డు భద్రత కోసం గ్రామపంచాయతీ చేపట్టిన చర్యలను గ్రామస్తులు అభినందించారు. ప్రజల అవసరాలను గుర్తించి సొంత నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్న సర్పంచ్ రాధ మనోహర్‌ను వారు ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి.

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE