e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఆ ఏజెన్సీలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు..

రిమ్స్ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఏజెన్సీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వినతి

మన భారత్, కలెక్టరేట్ ఆదిలాబాద్: సెప్టెంబర్ 28, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో రిమ్స్‌లో కొనసాగుతున్న ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల వ్యవహారంపై పలువురు ఏజెన్సీల నిర్వాహకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వహణలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

రిమ్స్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల్లో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఏజెన్సీలు కూడా ఉన్నాయని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల ప్రకారం అర్హత లేని లేదా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఏజెన్సీలకు అవకాశం కల్పిస్తే అర్హత కలిగిన ఇతర ఏజెన్సీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

అలాగే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల కాలపరిమితిని పొడిగించే అధికారం లేని జిల్లా స్థాయి అధికారి కొన్ని ఏజెన్సీలను కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారని ఆరోపిస్తూ, ఈ అంశంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని వారు కోరారు. సంబంధిత ఉత్తర్వులు, అనుమతులు, నిబంధనలను పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి

బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న ఏజెన్సీలను నిబంధనల ప్రకారం పరిశీలించి, అవి అనర్హమైనవిగా తేలితే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అర్హత కలిగిన అన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు సమాన అవకాశం కల్పించేలా జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త నోటిఫికేషన్ ద్వారా అర్హత ఉన్న ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పారదర్శకమైన విధానంలో ఎంపిక ప్రక్రియ చేపట్టాలని కోరారు. రిమ్స్‌లో ఔట్‌సోర్సింగ్ సేవల నిర్వహణకు సంబంధించి నిబంధనలు, అర్హత ప్రమాణాలు, కాలపరిమితి, అనుమతులపై సమగ్రంగా పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేసిన వారిలో కొల్లూరి స్వామి, గెడం శ్యామ్ సుందర్, అర్క దేవరావు, దత్తు, సిడామ్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE