e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ.. పైసా వసూల్

ప్రీ-ప్రైమరీ పోస్టుల భర్తీ….50 వేల నుంచి లక్ష వసూల్

మన భారత్, చిట్యాల:  మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేయనున్న ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులను  మధ్య తరగతి కుటుంబాల చెందినటువంటి వారు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే అర్హులైన వారు కాకుండా కొందరు అధికార పార్టీకి చెందిన నాయకులు వేలం వేసినట్టుగా వ్యవహరిస్తూ, ఒక్కో పోస్టుకు సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి మైదం శ్రీకాంత్ ఆరోపించారు.

అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. పోస్టుల భర్తీలో డబ్బుల వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి, అర్హత, మెరిట్ ఆధారంగా పారదర్శకంగా పోస్టులను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.

“అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరిగేలా నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి. పోస్టులను అమ్మకానికి పెట్టే పరిస్థితి ఉండకూడదు” అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE