e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

చాకలి ఐలమ్మ…జయంతి వేడుకలు

మన భారత్, చిట్యాల : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రజా సంఘాల DYFI.VCK. అంబేద్కర్ యువజన. రజక సంఘ నాయకులు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ నాటి భూస్వామ్య, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పేదలు, కూలీలు, మహిళల హక్కుల కోసం పోరాడిన స్ఫూర్తిదాయకమైన నాయకురాలని అన్నారు. అణచివేతకు భయపడకుండా తన హక్కుల కోసం పోరాడిన ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, భూమి, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం సాగిన ప్రజా పోరాటానికి ప్రతీక అని అన్నారు. నేటి సమాజంలో కూడా పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రత్యేకంగా యువత విద్య, వైద్యం, ఉపాధి వంటి ప్రాథమిక హక్కుల కోసం చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాజిక వివక్ష, దోపిడీ, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలను కొనసాగిస్తామని తెలిపారు.చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం – ప్రజా హక్కుల కోసం ఐక్యంగా పోరాడతాం అని ప్రజా సంఘాల నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన ఆర్గనైజింగ్ రాష్ట్ర కార్యదర్శి పుల్ల మల్లయ్య , వి సి కె రాష్ట్ర యూత్ అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ DYFI భూపాలపల్లి జిల్లా కార్యదర్శి భూక్యా నవీన్, రజక సంఘం మండల అధ్యక్షుడు ఉప్పుల కిరణ్ , ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మన భారత్ రిపోర్టర్ చిట్యాల..

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE