e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఘనంగా KRV జన్మదిన వేడుకలు..

కె.ఆర్. విశ్వజిత్ నాయక్‌కు ఘనంగా జన్మదిన సన్మానం

మన భారత్, సెప్టెంబర్ 25, ఆదిలాబాద్: తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తనయుడు కె.ఆర్. విశ్వజిత్ నాయక్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తలమడుగు మండల తెలంగాణ రక్షణ సేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

తలమడుగు మండల తెలంగాణ రక్షణ సేన కన్వీనర్ గజానన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్వజిత్ నాయక్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని నాయకులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు మాట్లాడుతూ.. విశ్వజిత్ నాయక్ భవిష్యత్తులో ప్రజా సేవా కార్యక్రమాల్లో మరింతగా ముందుకు సాగాలని కోరారు. యువత సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకులు గడుగు పోచన్న, మెంచు కాంతారావు, శివాజీ, గుడిహత్నూర్ మండల కన్వీనర్ పెట్ల మహేందర్, ఆశన్న తదితరులు పాల్గొన్నారూ.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE