e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి..

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి

జయంతి వేడుకల్లో ఘన నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, సెప్టెంబర్ 26, ఆదిలాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న ఆర్.ఎస్. ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అడిషనల్ కలెక్టర్ చిత్రుతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ సమాజంలో నెలకొన్న అన్యాయాలు, వివక్షకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. నేటి యువత ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తెలుసుకుని, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని సూచించారు.

చాకలి ఐలమ్మ జీవితం మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆమె ఆశయాలు, పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఐలమ్మ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆమె ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి సోనియా, రజక సంఘం నాయకులు దత్తు, రజక సంఘం అధ్యక్షుడు కార్తీక్, మహిళా అధ్యక్షురాలు రమక్క, వేముల నాగరాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE