e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

రిమ్స్‌లో అగ్నిప్రమాదం.. భద్రతా చర్యలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష

SNCUలో పరిస్థితులను పరిశీలించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

బాధిత చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

మన భారత్, సెప్టెంబర్ 22, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్ (SNCU)లో సోమవారం రాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి కూడా మంత్రితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్. చొంగ్తు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి రిమ్స్‌లో అగ్నిప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రెస్క్యూ, రిలీఫ్ చర్యలపై ఆరా

అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో SNCUలో చికిత్స పొందుతున్న శిశువులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించిన విధానంపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది చేపట్టిన రెస్క్యూ చర్యల వివరాలను సమీక్షించారు.

ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న శిశువులు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను మంత్రి ఆరా తీశారు. ప్రతి చిన్నారికి అవసరమైన వైద్య సేవలను అందించాలని, ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమైన వైద్య సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బాధిత కుటుంబాలకు భరోసా

అగ్నిప్రమాదంతో ఆందోళనకు గురైన చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఘటనతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.

ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లపై సమీక్ష

రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, అత్యవసర సమయాల్లో స్పందించే వ్యవస్థ, రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానం తదితర అంశాలపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అగ్నిప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో చర్చించారు.

ఆసుపత్రిలోని అగ్నిమాపక పరికరాలు, అత్యవసర మార్గాలు, విద్యుత్ భద్రతా వ్యవస్థలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

ఈ సమీక్షలో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, రిమ్స్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE