అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Published on

-Advertisement-

మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే

మన భారత్, సెప్టెంబర్ 22, ఆదిలాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

ముందుగా గుడిహత్నూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్యులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను తెలుసుకున్నారు.

రాజురా గ్రామస్తులకు పరామర్శ

అనంతరం నెరడిగొండ మండలంలోని రాజురా గ్రామానికి చెందిన పలువురు శ్రీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాలను తెలుసుకున్నారు.

హీరిబాయిని పరామర్శించిన ఎమ్మెల్యే

తదుపరి గుడిహత్నూర్ మండలంలోని తోషం తాండకు చెందిన హీరిబాయిని కూడా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హీరిబాయికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యులకు సూచించారు.

ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం, అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమాల్లో ఆయా మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

సోయాబీన్ కాయల్లోనే మొలకలు.. రైతుల్లో ఆందోళన

  కోతకు ముందే గింజలు మొలకెత్తడంతో దిగుబడి, నాణ్యతపై ప్రభావం పంటను పరిశీలించి నష్టపరిహారం అందించాలని రైతుల విజ్ఞప్తి మన భారత్, సెప్టెంబర్...

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం

రిమ్స్‌ను సందర్శించిన బీఆర్ఎస్ మహిళా బృందం బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న మెరుగైన వైద్యం...

రిమ్స్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది..

మరో ఇద్దరు పసికందుల మృతి.. విషాదంలో కుటుంబాలు ఆసిఫాబాద్‌ లింగాపూర్‌, ఇంద్రవెల్లి దుబ్బగూడకు చెందిన శిశువులూ మృతి మన భారత్‌, సెప్టెంబర్‌...

సబ్ స్టేషన్ ఏర్పాటుకు కృషి అభినందనీయం..

మన భారత్, ఆదిలాబాద్:  విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కు కృషి చేసిన గండ్రత్ సుజాత ఆశన్నతో పాటు సంబంధిత...

More like this