అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే మన భారత్, సెప్టెంబర్ 22, ఆదిలాబాద్: అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పలువురిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ముందుగా గుడిహత్నూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ రవి నాయక్ ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర ఆసుపత్రిలో...