e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఐటీ టవర్ త్వరలోనే ప్రారంభోత్సవం..

ఆదిలాబాద్ ఐటీ టవర్ ను పరిశీలించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు: త్వరలోనే ప్రారంభోత్సవం

మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బట్టి సావర్గం సమీపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఐటీ (IT) టవర్ ను కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు నరేష్ జాదవ్ గారు మరియు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలతో కలిసి ఐటీ టవర్ లోని వివిధ విభాగాలను, మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఆదిలాబాద్ ఐటీ టవర్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రారంభోత్సవ పనులను వేగవంతం చేసేలా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ ఐటీ టవర్ అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్ జిల్లాలోని స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఇక్కడే సాఫ్ట్‌వేర్ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని నేతలు పేర్కొన్నారు. అంతేకాకుండా, వెనుకబడిన ఆదిలాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా, సాంకేతికంగా మరింత అభివృద్ధి సాధించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, టీపీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత గారు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ స్టేట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ గారు, టీటీడీ మాజీ బోర్డు మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ గారు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు అంబకంటి అశోక్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు, డీసీసీ జనరల్ సెక్రటరీ గౌలి సంజయ్ గారు, మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి గారు, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు తొడసం దౌలత్ రావు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డేరా కృష్ణ రెడ్డి గారు, రుక్మ రెడ్డి గారులతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE