e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట

 తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవానికి తరలిరావాలి

చిట్యాల, మన భారత్: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చిట్యాల మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో “హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫోరం నాయకులు మాట్లాడుతూ ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న 9వ వార్షికోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చిట్యాల మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఫోరం గత తొమ్మిదేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

ఫోరం ఫౌండర్, రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీను ఆధ్వర్యంలో ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు యుగేందర్ తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను వివరించినట్లు చెప్పారు. ఉద్యమకారుల సంక్షేమానికి సంబంధించిన డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేలా ఫోరం తరఫున కృషి చేసినట్లు తెలిపారు.

ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యుగేందర్ కోరారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఉద్యమకారుల పాత్రను గుర్తుచేసుకుంటూ భవిష్యత్‌లో వారి సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్న 9వ వార్షికోత్సవ వేడుకలకు రాష్ట్రంలోని ఉద్యమకారులు, కళాకారులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా నాయకులు కాట్రేవుల కుమార్, గౌరవ అధ్యక్షుడు సాధ మల్లయ్య, ప్రధాన కార్యదర్శి కన్నబోయిన అశోక్, కోశాధికారి కంచర్ల కుమారస్వామి, ఉపాధ్యక్షులు సంఘ రాజేందర్, జాలిగపు కృష్ణయ్య, కార్యదర్శులు గణపతి, ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మీ శీలపాక రాజు మనభారత్ రిపోర్టర్ చిట్యాల

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE